![]() |
![]() |

జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ దాదాపు కొన్నేళ్ల నుంచి స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కున్న కష్టాలను వివరించాడు. "ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతీ ఒక్కరి సెల్ లో నానడం వలన ప్రతీ ఒక్కరికీ అలుసైపోయాం. ఎవరి వల్లనైనా ఏదైనా బాడ్ ఇన్సిడెంట్ జీవితంలో జరిగితే దాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ ఐపోవాలి. అప్పుడే వాడు రిగ్రెట్ అవుతాడు, మనం గ్రేట్ అవుతాం. నా టీమ్ లో ఉన్న వ్యక్తే నన్ను పాయింటౌట్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు అదే వ్యక్తిని నేను గ్రూప్ లో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. మేము ఒక ఈవెంట్ కి వెళ్లాం. అక్కడ నేను స్టేజి మీద యాంకరింగ్ చేస్తున్నా మిమిక్రీ చేస్తున్నా, గేమ్స్ ఆడిస్తున్నా అన్నీ చేస్తున్నా. అందరూ తిన్న తర్వాతే నేను తినాలి.
ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు మా ఫామిలీకి చెప్పుకున్నామండీ ప్లేట్స్ మీరు తీసుకుని తినేస్తారేంటండి అంటారు. అలా చాలా సార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడే తిడతారు, ఇక్కడే పొగుడుతారు, ఇక్కడే సన్మానాలు జరుగుతాయి, ఇక్కడే పూలదండలు వేస్తారు, ఇక్కడే పట్టు పాన్పులు మీద కూర్చోబెట్టి మీలాంటి గొప్పోళ్ళు లేరు అంటారు. చివరికి వాళ్ళు చనిపోతే చూడడానికి కూడా వెళ్లని వ్యక్తులు ఉన్న సమాజం మన సినిమా ఇండస్ట్రీ. 12 ఏళ్ళు జబర్దస్త్ అనే ఒక ప్రయాణం మాములు కాదు. జబర్దస్త్ మాకు ఇల్లు కొనిచ్చింది. అదే జబర్దస్త్ మాకు కార్ కొనిచ్చింది. అదే జబర్దస్త్ మమ్మల్ని దేశాలు తిప్పుతోంది. అదే జబర్దస్త్ మాకు మంచి పేరు ఇచ్చింది. " అంటూ చెప్పాడు జబర్దస్త్ రాకింగ్ రాకేష్.
![]() |
![]() |